ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pattabhi Fires On YCP Govt: "గంగవరం పోర్టులో.. రాష్ట్రవాటా ఎందుకు అమ్ముతున్నారు?"

By

Published : Dec 27, 2021, 3:29 PM IST

Pattabhi Fires On YCP Govt: గంగవరం పోర్టులో రాష్ట్ర వాటా ఎందుకు అమ్ముతున్నారని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమే ఇలాంటి చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ ప్రివ్యూ యాక్ట్ నిబంధనలను గంగవరం పోర్టు విషయంలో ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు.

TDP  leader Pattabhi slams ycp govt
TDP leader Pattabhi slams ycp govt

Pattabhi Fires On YCP Govt: రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా నేత పట్టాభి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకా 37 సంవత్సరాల నిరంతర ఆదాయం వచ్చే బంగారు బాతు లాంటి గంగవరం పోర్టును అదానీకి అమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కమీషన్ల కోసమే ఇలాంటి చర్యలకు దిగారని మండిపడ్డారు. జీవో 12లో స్పష్టంగా.. ఎంపవర్ గ్రూప్​ సెక్రటరీల కమిటీ.. ఓపెన్ బిడ్ ద్వారా అమ్మాలని సిఫార్సు చేసినప్పటికీ ఎవరి ప్రయోజనాల కోసం లీగల్ ఒపీనియన్ పేరుతో అదానీకి కట్టబెట్టారని ప్రశ్నించారు.

Pattabhi On Gangavaram Port: లాభాల్లో ఉన్న గంగిగోవు లాంటి గంగవరం పోర్టును కారుచౌకగా రూ. 645 కోట్లకే అమ్మకం వెనుక భారీ స్కాం ఉందని పట్టాభి ఆరోపించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ యాక్ట్ ప్రకారం రూ.100 కోట్లుపైబడిన ఏ టెండరు అయినా ఓపెన్ బిడ్ ద్వారా జరగాలని చెప్పిన ప్రభుత్వం.. గంగవరం విషయంలో ఎందుకు పాటించలేదని నిలదీశారు. గంగవరం పోర్టు అమ్మి విశాఖ ఉక్కు ఉనికికే ప్రమాదం తీసుకువచ్చారని విమర్శించారు.

"మైనర్‌ పోర్టులను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోర్టు కనెక్టివిటీ ఉంటే పెట్టుబడిదారులు ముందుకొస్తారు. ెట్టుబడుల ఆకర్షణకు పోర్టుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. గంగవరం పోర్టులో మన రాష్ట్రానికి 10.4 శాతం వాటా ఉంది. రుణభారం లేని పోర్టులోని రాష్ట్ర వాటా ఎందుకు అమ్మాల్సి వచ్చింది. లాభదాయక పోర్టులో రాష్ట్ర వాటా ఎందుకు అమ్ముతున్నారు..? అవసరం లేకున్నా ప్రభుత్వ ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారు" - పట్టాభి, తెదేపా నేత

ఇదీ చదవండి

పిల్లలకు కరోనా టీకా వేయించాలా? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా...

ABOUT THE AUTHOR

...view details