ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rythu Kosam Telugudesam: 'రైతుకోసం తెలుగుదేశం' పేరుతో రెండోరోజు నిరసనలు ఎక్కడంటే..

By

Published : Sep 15, 2021, 2:34 AM IST

అన్నదాతల అవస్థలు తీర్చాలంటూ తెదేపా(tdp) చేపడుతున్న 'రైతు కోసం తెలుగుదేశం' పోరాట నిరసనలు..... నేడు(2వ రోజు) కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు పార్లమెంటు స్థానాల పరిధిలో జరగనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని తదితర రైతు సమస్యలపై ఆందోళనలు నిర్వహించి తహసీల్దార్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వనున్నారు.

Rythu Kosam Telugudesam
రైతు కోసం తెలుగుదేశం పోరుబాట

రైతు కోసం తెలుగుదేశం(Rythu Kosam Telugudesam) కార్యక్రమంలో భాగంగా నేడు కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ స్థానాల పరిధిలో తెదేపా(tdp) నేతలు నిరసనలు తెలపనున్నారు. గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంట విరామం, ఆక్వా రైతు సమస్యలు, ఇన్​పుట్​ సబ్సిడీ, పంటనష్ట పరిహారం అందకపోవడం.. తదితర అంశాలపై ఆయా పార్లమెంట్ స్థానాల పరిధిలో ఆందోళనలు నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పార్లమెంట్​ స్థానాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమస్యలు పరిష్కరించకుండా వైకాపా ప్రభుత్వం రైతుల్ని బలిపీఠం ఎక్కించిందని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details