ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి

By

Published : Jun 11, 2021, 3:51 PM IST

అసభ్యకరంగా ప్రవర్తించిన అన్నను.. సోదరి రోకలిబండతో మోది హత్య చేసిన ఘటన తెలంగాణ కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి
MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి

మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన అన్నను.. సోదరి రోకలిబండతో మోది హత్య చేసిన ఘటన తెలంగాణ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. సతీశ్​ కుటుంబ సభ్యులతో కలిసి కూలీ పని చేసుకుంటూ జీవిస్తుండేవాడు. గురువారం ఉదయం నుంచి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సతీశ్​ కుటుంబ సభ్యులతో మళ్లీ గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే సోదరిపై మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించాడు. చేసేదేమీలేక ఇంట్లో ఉన్న రోకలిబండతో అతని తలపై మోదీ హతమార్చింది. సంఘటనా స్థలాన్ని సీఐ లక్ష్మీ బాబు, ఎస్సై నాయుడు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:మానసిక ఒత్తిడితో వివాహిత ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details