ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అలుగులో చిక్కుకున్న పాఠశాల బస్సు.. స్థానికుల సాహసంతో పిల్లలు సేఫ్

By

Published : Jul 22, 2022, 7:56 PM IST

School Bus Stuck in Flood: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచ కొత్తచెరువు అలుగు వద్ద పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. వెంటనే స్పందించి స్థానికులు బస్సులోంచి విద్యార్థులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

School Bus Stuck in Flood
School Bus Stuck in Flood

School Bus Stuck in Flood: తెలంగాణలోని మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో పెనుప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని కొత్తచెరువు అలుగు పారుతోంది. ఈరోజు మరోసారి జోరుగా వర్షం కురవటంతో.. వరద ఎక్కువైంది. రోడ్డుపై నుంచి మోకాలి ఎత్తుతో నీరు వెళ్తోంది. ఈ విషయం తెలియని.. తొర్రూర్​ ఆర్యభట్ట పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో అదే దారి వెంట వెళ్లగా.. ప్రమాదవశాత్తు అలుగు మధ్యలో చిక్కుకుపోయింది.

అలుగులో చిక్కుకున్న పాఠశాల బస్సు.. స్థానికుల సాహసంతో పిల్లలు సేఫ్

వరద పెద్ద ఎత్తున పారుతుండటంతో.. దారి సరిగ్గా తెలియక బస్సు టైరు రోడ్డు దిగింది. బస్సు ఓ వైపు వంగిపోవటంతో డ్రైవర్​.. వెంటనే బస్సును అక్కడే ఆపేశాడు. వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. టైర్లు మునిగేలా వస్తున్న వరదను చూసి.. చిన్నారులు పెద్ద ఎత్తున అరవటం ప్రారంభించారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి.. బస్సులో ఉన్న చిన్నారులను హుటాహుటిన ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవటంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details