ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Loan Apps Case Update: రుణ యాప్​ల కేసులో 13 డొల్ల కంపెనీల గుర్తింపు.. ఫోర్జరీ సంతకాలతో..

By

Published : Jan 29, 2022, 5:30 PM IST

Loan Apps Case: చైనా రుణయాప్‌లు, పెట్టుబడుల కేసులో 13 డొల్ల కంపెనీలున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆయా సంస్థలపై రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ హైదరాబాద్​ సీసీఎస్​ (Hyderabad cyber crime station)లో ఫిర్యాదు చేసింది. నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో ఈ కంపెనీలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

Loan Apps Case Update
Loan Apps Case Update

Loan Apps Case: రుణ యాప్, పెట్టుబడుల పేరుతో మోసాలకు సంబంధించి కేసులో 13 డొల్ల కంపెనీలున్నట్లు తేలింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో కంపెనీలు ఏర్పాటు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులను కోరారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రుణ, పెట్టుబడుల అప్లికేషన్ల కేసులో.. తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు ఇప్పటికే కేసునమోదు చేశారు.

ఇదీచూడండి:LOAN APPS: రుణయాప్​ల కొత్త ఎత్తుగడలు.. హైదరాబాద్​లో తిష్ట వేసేందుకు యత్నాలు

ఇందులో దాదాపు 2,200 కోట్ల రూపాయలను హవాలా మార్గంలో హాంకాంగ్, అక్కడి నుంచి చైనా తరలించినట్లు ప్రాథమికంగా తేల్చారు. సులభ రుణాల పేరుతో అమాయకులకు రుణాలు ఇచ్చి అధిక వడ్డీ వసూలు చేశారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలిస్తామంటూ అమాయకులను నమ్మించి పలు యాప్​ల ద్వారా డబ్బులు స్వీకరించారు. ఆ తర్వాత నగదు చెల్లించకుండా మోసాలకు పాల్పడ్డారు.

మోసాలకు పాల్పడుతున్నారిలా..

మాల్ 008, మాల్ 98, వైఎస్0123, మాల్ రిబేట్.కామ్ పేరుతో అప్లికేషన్లు రూపొందించి మెసేజ్​, వాట్సాప్ సందేశాలు, మెయిల్స్ ద్వారా అమాయకులను ఆకర్షించారు. ఆ తర్వాత డబ్బులు స్వీకరించి వాటిని డొల్ల కంపెనీల్లోని ఖాతాలకు మళ్లించారు. అక్కడి నుంచి విదేశాలకు తరలించారు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి చైనీయులకు సహకరించిన కేసులో ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ మోసాల వెనుక ఇద్దరు చైనీయులు కీలక పాత్ర పోషించినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:Allu Arjun Daughter: అర్హ చేసిన పనికి బన్నీ ఫిదా

ABOUT THE AUTHOR

...view details