ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ramappa Temple : రామప్ప ఆలయానికి క్యూ కట్టిన ప్రముఖులు, పర్యాటకులు

By

Published : Jul 27, 2021, 10:42 AM IST

ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయ సందర్శనకు ప్రముఖులు క్యూ కట్టారు. వారితో పాటు పర్యాటకులూ పోటెత్తారు. పెద్దఎత్తున తరలివస్తున్న సందర్శకులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. రామప్ప ఆలయ శిల్పకళను చూసి పర్యాటకులు అద్భుతమైన అనుభూతి పొందుతున్నారు.

RAMAPPA
RAMAPPA

అద్భుత శిల్పకళకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించడంతో ప్రముఖులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాఠోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సీతక్క రామప్పలోని రుద్రేశ్వరుణ్ని దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమైక్య పాలనలో రాష్ట్రంలోని ఏ కట్టడానికి గుర్తింపు రాలేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే రామప్పకు ప్రపంచ ప్రఖ్యాతి దక్కిందని మంత్రి సత్యవతి అన్నారు.

Ramappa Temple : రామప్ప ఆలయానికి క్యూ కట్టిన ప్రముఖులు, పర్యాటకులు

గత ప్రభుత్వాలు విఫలం..

"కాకతీయుల అద్భుత శిల్పకళను వెలికితీయడంలో.. గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సీఎం కేసీఆర్ హయాంలో కాకతీయుల కీర్తి చాటేలా.. అనేక కార్యక్రమాలు చేపట్టారు. మిషన్ కాకతీయ పథకం పేరుతో.. చెరువులను పునరుద్ధరించి రైతులకు సాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు."

- సత్యవతి రాఠోడ్, రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి

పర్యాటక కేంద్రంగా..

"అన్ని దేశాలు యునెస్కో గుర్తింపునకు మద్దతిస్తాయో లేదోనని కొంచెం టెన్షన్​ ఉండేది. కానీ.. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్పను గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం. ఆలయాలు, కట్టడాలు ఏవైనా.. సాధారణంగా రాజుల పేరుతో ఉంటాయి. కానీ కేవలం రామప్ప ఆలయం మాత్రం.. ఆలయం నిర్మించిన శిల్పి పేరుతో ప్రాచుర్యం పొందింది. యునెస్కో గుర్తింపుతో రామప్ప పరిసర ప్రాంతాలు కూడా ప్రపంచ ఖ్యాతి గడిస్తాయి. ఇక్కడికి విదేశీ పర్యాటకులు వస్తారు. ఈ ప్రాంతమంతా మంచి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది."

- శ్రీనివాస్ రెడ్డి, టూరిస్ట్ గైడ్

ఇవీ చదవండి :

RAMAPPA: గుర్తింపు దక్కింది సరే.. సంరక్షణ మాటేంటి?

ABOUT THE AUTHOR

...view details