ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RGV ON JAGAN: 'జగన్ గారూ.. మీ చుట్టూ ఉన్న వాళ్లతో జాగ్రత్త'

By

Published : Jan 7, 2022, 3:34 PM IST

సినిమా టికెట్ ధరల విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వానికి, దర్శకుడు ఆర్జీవీకి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. తాజాగా.. ఆయన సీఎం జగన్​ను ఉద్దేశిస్తూ చేసిన చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా అవుతున్నాయి.

RGV
RGV

గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ ధరల విషయంలో టాలీవుడ్ సినీ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ దుమారం.. సంచలన దర్శకుడు రామ్​గోపాల్ వర్మ ఎంటర్ కావడంతో హాట్ టాపిక్​గా మారింది. మంత్రుల మాట తీరు, జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు ఆర్జీవీ. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"వైకాపాలో నేను నమ్మే ఒకే ఒక్క వ్యక్తి వై.ఎస్ జగన్. ఆయన చుట్టూ ఉన్న వైకాపా లీడర్స్ జగన్​ను తప్పుదోవ పట్టిస్తూ వారికి అనుగుణంగా ఆయనను వాడుకుంటున్నారు. జగన్ గారూ.. మీ చుట్టూ ఉన్న వాళ్లతో జాగ్రత్త. మీ పట్టుదల, ప్రవర్తనను చూసి నా తల్లి, సోదరి ఓటు వేశారు. కానీ మీ చుట్టూ ఉంటూ మీ ఇమేజ్ డామేజ్ చేసే వారిని చూసి షాకవుతున్నారు'' - రాంగోపాల్ వర్మ

ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన కొందరు నెటిజన్లు.. 'కొడాలి నాని కోసం వేసిందే కావొచ్చు' అంటూ.. కామెంట్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:RGV vs Perni Nani: "మంత్రిగారూ.. టైమ్ ఇస్తే కలుస్తా" తప్పకుండా.. త్వరలోనే కలుద్దాం!

Ram gopal Varma: కొడాలి నాని ఎవరో నాకు తెలియదు: ఆర్జీవీ

ABOUT THE AUTHOR

...view details