ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో నేటి నుంచి తెరుచుకోనున్న ప్రాథమిక పాఠశాలలు

By

Published : Feb 1, 2021, 4:28 AM IST

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల 45 నిమిషాల వరకు తరగతులు నిర్వహించనున్నారు.

primary schools reopen in ap
primary schools reopen in andhrapradesh

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా లాక్‌డౌన్ తర్వాత మొదటిసారిగా ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులు బడులకు వెళ్లనున్నారు. వీరికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల45 నిమిషాల వరకు తరగతులు నిర్వహిస్తారు. గత ఏడాది నవంబరు 2 నుంచి విడతల వారీగా బడులను పునఃప్రారంభిస్తూ వస్తున్నారు.

ప్రాథమిక పాఠశాలలు తెరచుకుంటే రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ పూర్తిగా ప్రారంభించినట్లవుతుంది. విద్యార్థులు బడులకు వచ్చేందుకు తల్లిదండ్రుల నుంచి తప్పనిసరిగా అనుమతి పత్రాలను తీసుకోవాలి. విద్యార్థులు, బోధనా సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉంటే రోజూ తరగతులు నిర్వహిస్తారు. 21 నుంచి 40 మంది పిల్లలు ఉండి, రెండు గదులు ఉంటే రోజూ బడి కొనసాగుతుంది. ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులను కూర్చోబెడతారు. గదులు సరిపడా లేకపోతే విడతల వారీగా తరగతులు నిర్వహిస్తారు. 1, 3, 5 తరగతులు ఒకరోజు, 2, 4 తరగతులకు మరో రోజు పాఠశాల ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details