ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: పెళ్లిలో చేతివాటం చూపిన పురోహితుడు

By

Published : May 18, 2021, 6:39 PM IST

పురోహితులు శుభకార్యాలు జరిపిస్తుంటారు.పెళ్లిలు, గృహప్రవేశాలు, సత్యనారాయణ వ్రతాలు చేయిస్తుంటారు. దక్షిణ తీసుకొని వెళ్లిపోతారు. కాని ఓ పురోహితుడు పెళ్లిలో చేతివాటం ప్రదర్శించాడు. ఏకంగా మంగళసూత్రాన్నే మాయం చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని మెదక్​ జిల్లా పడాలపల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేప్టటారు.

పెళ్లిలో చేతివాటం చూపిన పురోహితుడు
పెళ్లిలో చేతివాటం చూపిన పురోహితుడు

పెళ్లిలో చేతివాటం చూపిన పురోహితుడు

తెలంగాణలోని మెదక్ జిల్లా పడాలపల్లిలో ఓ వివాహవేడుకలో పురోహితుడే చేతివాటం ప్రదర్శించడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. వేదమంత్రాలు ఉచ్ఛరిస్తూ భార్యాభర్తలకు మంగళకర వాఖ్యాలు చెబుతూ వివాహ తంతు జరిపించే పురోహితుడే ఏకంగా మంగళసూత్రాన్నే మాయం చేశాడు. పెళ్లి అయిపోయాక వధువు మెడలో పుస్తెలతాడు లేదని గమనించిన కుటుంబసభ్యులు పురోహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఓ జంటకు వివాహం జరిగింది. పడాలపల్లికి చెందిన మునిరాతి పెంటయ్య సుశీల దంపతుల కొడుకు జ్ఞానేందర్.. దాసు నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంతకు ఈనెల 16న పెళ్లి జరిగింది. గజ్వేల్‌కు చెందిన ఓ పురోహితుడు వివాహం జరిపించాడు. అమ్మాయి మెడలో వేయాల్సిన 3 తులాల బంగారు పుస్తెలతాడును పురోహితుడు జేబులో వేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. ఈ దృశ్యాలు కూడా పెళ్లి వీడియోలో రికార్డయ్యాయని చెబుతున్నారు. రెండు రోజులుగా పురోహితుడికి ఫోన్ చేస్తే.. స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడని.. నేరుగా ఇంటికి వెళ్లి అడిగితే కుటుంబ సభ్యులు తమకు తెలియదు అంటున్నారని వాపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడు జేబులో పుస్తెలతాడు వేసుకుంటున్న వీడియోను పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి:

'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

కరోనాను జయించిన 21 రోజుల చిన్నారి

ABOUT THE AUTHOR

...view details