ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాలపిట్ట దర్శనం.. దసరా పండుగ పరిపూర్ణం

By

Published : Oct 25, 2020, 9:06 PM IST

పాలపిట్ట దర్శనంతోనే దసరా సంబరాలు పరిపూర్ణం అవుతాయని ప్రజల విశ్వాసం. ముఖ్యంగా పండుగరోజు పాలపిట్టను చూడటానికి చిన్నాపెద్దా, పిల్లాజెల్లా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు. అలాంటిది తెలంగాణ రాష్ట్ర వరంగల్ గ్రామీణ జిల్లా వర్థన్నపేట ప్రజలకు ఆ పాలపిట్ట దర్శనం లభించింది. మనమూ ఆ ఎక్స్​క్లూసివ్​ విజువల్స్​ను చూసి మన దసరా సంబరాలను అంబరాన్నంటేలా చేసుకుందామా..!

Palapitta was seen in Wardhannapet
పాలపిట్ట దర్శనం.. దసరా పండుగ పరిపూర్ణం

దసరా పర్వదినాన జమ్మి అనంతరం పాలపిట్ట చూడడం ఆనవాయితీగా పెద్దలు చెబుతారు. పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నమని విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగడాన్ని ఎంతో అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు.

తెలంగాణ రాష్ట్ర వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పాలపిట్ట దర్శనం ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ విజువల్స్ ఈటీవి భారత్​ కెమెరాకు చిక్కాయి. దసరా అనగానే ఆ పక్షి కోసం తహతహలాడే ప్రజలకు పాలపిట్ట దర్శనం కనువిందు చేసింది.

పాలపిట్ట దర్శనం.. దసరా పండుగ పరిపూర్ణం

ఇదీ చూడండి:ఘనంగా దుర్గమ్మకు తెప్పోత్సవం

ABOUT THE AUTHOR

...view details