ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Payyavula Keshav: ఏపీఈఆర్సీ ఛైర్మన్​తో పయ్యావుల భేటీ.. సెకితో ఒప్పందంపై చర్చ

By

Published : Nov 9, 2021, 2:02 PM IST

హైదరాబాద్​లో ఏపీఈఆర్సీ ఛైర్మన్ నాగార్జునరెడ్డితో పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. సెకి నుంచి సోలార్ విద్యుత్​ను కొనుగోలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వినియోగదారుడిపై భారం పడకుండా కమిషన్ పని చేయాలని కోరినట్లు తెలిపారు.

PAC Chairman Payyavula Keshav
PAC Chairman Payyavula Keshav

పయ్యావుల కేశవ్

తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుంటే అధిక ధరకు కొనుగోలు చేయడం ఏంటని ప్రజాపద్దుల ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. హైదరాబాద్​లో ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జునరెడ్డిని కలిసిన ఆయన.. విద్యుత్ ఒప్పందాలపై ఉన్న అనుమానాలు వివరించినట్లు తెలిపారు.

రైతుల కోసం చేసే విద్యుత్ కొనుగోలును తాము తప్పు పట్టట్లేదని స్పష్టం చేశారు. మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్‌ దొరుకుతోందని.. అలాంటప్పుడు అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయటం ఎందుకని? ప్రశ్నించారు. వినియోగదారుడిపై ఎలాంటి భారం పడకుండా చూడాలని కోరానని తెలిపారు.

'విద్యుత్‌ కొనుగోలుపై కమిషన్ దృష్టికి తెచ్చా. వినియోగదారుడిపై భారం పడకుండా కమిషన్ పనిచేయాలి. వినియోగదారులపై భారం లేకుండా చూస్తానని ఛైర్మన్‌ కూడా చెప్పారు' - పయ్యావుల కేశవ్, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్

ఇదీ చదవండి:

ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. భాజపా నేతలకు మంత్రి కొడాలి నాని వార్నింగ్

ABOUT THE AUTHOR

...view details