ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపా కేంద్ర కార్యాలయాన్ని పరిశీలించిన ఎన్‌ఎస్‌జీ డీఐజీ

By

Published : Aug 25, 2022, 6:48 PM IST

Updated : Aug 26, 2022, 6:49 AM IST

NSG IG inspected TDP head office
ఎన్‌ఎస్‌జీ ఐజీ ()

NSG IG inspected TDP head office తెదేపా కేంద్ర కార్యాలయాన్ని ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్‌సింగ్‌ పరిశీలించారు. చంద్రబాబు పర్యటనల్లో గొడవలు జరగటంపై దృష్టి సారించిన ఎన్‌ఎస్‌జీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని సైతం పరిశీలించింది. పార్టీ కార్యాలయంలోని ప్రతి అంతస్తుకి, ప్రతి గదికీ వెళ్లి నిశితంగా పరిశీలించింది.

NSG IG inspected TDP head office: తెదేపా కేంద్ర కార్యాలయాన్ని, ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసాన్ని దిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్‌సింగ్‌ నేతృత్వంలోని బృందం గురువారం తనిఖీ చేసింది. సాయంత్రం 4 గంటల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన సమర్‌దీప్‌సింగ్‌ బృందం ప్రతి అంతస్తుకి, ప్రతి గదికీ వెళ్లి నిశితంగా పరిశీలించింది. చంద్రబాబు ఛాంబర్‌ ఎక్కడ, ఆయన సందర్శుకుల్ని ఎక్కడ కలుస్తారు? ఆయనను కలిసేందుకు వచ్చేవారిని ఎలా తనిఖీ చేస్తున్నారు? ఏఏ పరికరాలను వినియోగిస్తున్నారు? స్థానిక పోలీసులు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? వంటి విషయాలన్నీ ఆయన కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. తెదేపా కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అశోక్‌బాబు.. ఎన్‌ఎస్‌జీ డీఐజీకి అన్ని వివరాలూ తెలియజేశారు.

అనంతరం సమరదీప్‌సింగ్‌ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని, అక్కడ భద్రతాపరమైన అంశాల్ని పరిశీలించారు. పలువురు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్నీ సైతం ఎన్‌ఎస్‌జీ డీఐజీ కలిసినట్టు సమాచారం. చంద్రబాబు పర్యటనల్లో ఇటీవల వైకాపా నాయకులు తరచూ గొడవలు సృష్టిస్తుండటడం, కొన్ని నెలల క్రితం తెదేపా కార్యాలయంపై వైకాపా నాయకుల ప్రోత్సాహంతో అల్లరి మూకల దాడి, తాజాగా కుప్పంలో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెదేపా నాయకులు చెబుతున్నారు. చంద్రబాబుకి కల్పిస్తున్న భద్రతను పర్యవేక్షించేందుకు ఎన్‌ఎస్‌జీ డీఐజీ రావడం అందులో భాగమేనని అంటున్నారు.

దాడులను పరిగణలోకి తీసుకోవడం అభినందనీయం: ‘వైకాపా అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే.. చంద్రబాబు చలోఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనకుండా ఆయన ఇంటి గేట్లను తాళ్లతో కట్టేశారు. ఆయన అమరావతి పర్యటనకు వెళితే బస్సుపై రాళ్లేశారు. పైగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని అప్పటి డీజీపీ ఆ చర్యను సమర్థించారు. ప్రస్తుత మంత్రి, అప్పటి ఎమ్మెల్యే జోగి రమేష్‌... చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చారు. చంద్రబాబు ఎప్పుడు కుప్పం వెళ్లినా ఏదో రకమైన అవరోధాలు సృష్టించాలని చూస్తున్నారు. ఆయన కాన్వాయ్‌పై రాళ్లేసినవారికి, కాన్వాయ్‌ని అడ్డుకున్నవారికీ డబ్బిస్తామని చెప్పి..వైకాపా నాయకులు రౌడీమూకల్ని ఉసిపగొల్పుతున్నారు. చంద్రబాబుని భౌతికంగా కూడా ఇబ్బంది పెట్టాలని వైకాపా ప్రభుత్వం చూస్తోంది. అందుకే ఆయన భద్రతపై కేంద్రం స్పందించింది. చంద్రబాబు రక్షణపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి లేకపోవడం సిగ్గుచేటు’’ అని అశోక్‌బాబు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 26, 2022, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details