ఆంధ్రప్రదేశ్

andhra pradesh

No Permission: అమరావతి ఉద్యమానికి రేపటితో 600 రోజులు.. ర్యాలీకి అనుమతించని పోలీసులు

By

Published : Aug 7, 2021, 11:40 AM IST

అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం రేపటితో 600వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా అమరావతి నుంచి మంగళగిరి వరకు రైతులు ర్యాలీ చేసేందుకు సంకల్పించారు. ఇందుకు అనుమతి లేదని తుళ్లూరు పోలీసులు ప్రకటించారు.

no permission
no permission

అమరావతి రైతులు తలపెట్టిన రేపటి ర్యాలీకి.. పోలీసులు అనుమతి నిరాకరించారు. రాజధాని పరిరక్షణ పేరిట అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం.. ఆదివారంతో 600వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా.. రాజధాని నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు. స్పందించిన తుళ్లూరు పోలీసులు.. అనుమతి లేదని తేల్చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు. తుళ్లూరు సీఐ పేరిట ఈ మేరకు ప్రకటన జారీ అయ్యింది.

ABOUT THE AUTHOR

...view details