ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబం నివాళులు

By

Published : May 28, 2022, 9:11 AM IST

NTR 100th Birth Anniversary : హైదరాబాద్ ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు జరుపుతున్నారు. తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు ఘాట్ వద్దకు చేరుకుని వారి తాతను స్మరించుకున్నారు. మరోవైపు నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద యుగపురుషుడికి నివాళులర్పించారు.

నివాళులర్పిస్తున్న కళ్యాణ్​రామ్​, జూనియర్​ ఎన్టీఆర్​
నివాళులర్పిస్తున్న కళ్యాణ్​రామ్​, జూనియర్​ ఎన్టీఆర్​

NTR 100th Birth Anniversary : తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ జయంతి వేళ ఆయన అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

Nandamuri Family at NTR Ghat : ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న నందమూరి రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు, దగ్గుబాటి పురందరేశ్వరి దంపతులు, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ స్వర్గీయ నందమూరి తారకరామారావుకు నివాళులర్పించారు. ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పోర్ట్ ల్యాండ్‌ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అందజేస్తోన్నకుట్టుమిషన్లు, వీల్‌ఛైర్లు, దుప్పట్లను ఎన్టీఆర్ ఘాట్ వద్ద లబ్ధిదారులకు పురందరేశ్వరి అందజేయనున్నారు.

"మే 28 2023 వరకు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఏపీ, తెలంగాణలో శత జయంతి ఉత్సవాలు జరుపుతాం. ఉత్సవాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీలో బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు ఉన్నారు." -- పురందరేశ్వరి

"ఎన్టీఆర్ నాకు దేవుడు. ఆయన పెట్టిన బిక్ష వల్లే ప్రఖ్యాత నటుడిగా మీ ముందు ఉన్నాను. ఆయన ద్వారానే మద్రాస్ ఫిలిం స్కూల్‌లో జాయిన్ అయ్యాను. మీ తోటి ఉన్న వారిలో పది మందికి సాయం చేయండి అదే ఆయనకు ఘన నివాళి. కొన్నేళ్లు ఆయన పక్కన ఉన్న వ్యక్తిని. సమాజమే దేవాలయం అన్న మనిషి తాను. మన కళ్ల ముందు మనం చూసిన దేవుడు ఆయన. ఈరోజు పెద్దాయన బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడిని. అలాంటి ఓ యుగపురుషుడిని మళ్లీ ఎప్పుడు చూస్తామో. ఎన్టీఆర్‌ ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మనందరిపైన ఉంటాయి." -- రాజేంద్రప్రసాద్, సినీనటుడు

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details