ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Mla Response: వృద్ధ దంపతుల కష్టాలపై ఈటీవీ భారత్​ కథనం.. ఎమ్మెల్యే సాయం

By

Published : Oct 11, 2021, 6:55 PM IST

90 ఏళ్ల వృద్ధుడికి ఐరిస్ సమస్యతో ఆధార్ కార్డు మంజూరీ కాకపోవడంపై ఈటీవీ భారత్(Mla Response to Etv Bharat Story) ప్రచురించిన "వృద్ధ్యాప్యంలో అష్టకష్టాలు.. తొమ్మిది పదుల వయసులో బుట్టలు అల్లుతూ..!" కథనానికి స్పందన లభించింది. ఈ కథనాన్ని చూసి మానవత్వంతో స్పందించిన.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్(Thungathurthy MLA Gadari Kishore).. ఆ వృద్ధ దంపతులకు రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. వారిద్దరికి పింఛను వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Mla gadari kishore Response to Etv Bharat Story
వృద్ధ దంపతుల కష్టాలపై ఈటీవీ భారత్​ కథనం.. ఎమ్మెల్యే సాయం

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నూతన్​కల్ మండలం వెంకేపల్లికి చెందిన పాపయ్య దంపతుల కష్టాలపై ఈటీవీ భారత్(Mla Response to Etv Bharat Story) "వృద్ధ్యాప్యంలో అష్టకష్టాలు.. తొమ్మిది పదుల వయసులో బుట్టలు అల్లుతూ..!" అనే కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్(Thungathurthy MLA Gadari Kishore) స్పందించారు. వెంటనే దంపతుల వద్దకు వెళ్లి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా.. దంపతులకు పింఛన్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.

"ఈ దంపతులపై ఈటీవీ భారత్​ కథనాన్ని చూశాను. కాటికికాలు చాపిన వయస్సులోనూ ఎవరిపై ఆధారపడకుండా బుట్టలు అమ్ముతూ జీవిస్తున్న ఈ దంపతులను చూసి ముచ్చటేసింది. వారి కష్టాలు నన్ను కదిలించాయి. చనిపోయేవరకు ఆత్మగౌరవంతో బతకాలన్న వారి పట్టుదల నాకు నచ్చింది. వారికి నేను చేసింది సాయం కాదు. ఇది నా బాధ్యత.. వారి హక్కు. వారి కష్టాన్ని నా వరకు తీసుకొచ్చిన ఈటీవీ భారత్​కు అభినందనలు."

- గాదరి కిశోర్, తుంగతుర్తి ఎమ్మెల్యే

"మా కష్టాన్ని చూసిన ఇరుగుపొరుగు వాళ్లు టీవీ వాళ్లకు చెప్పిండ్రు. వాళ్లు మా దగ్గరికొచ్చి మా బతుకును దగ్గరి నుంచి చూసిండ్రు. మాకు ఉన్న ఒక్క కొడుకు కాలం చేసిండు. బతకడానికి బుట్టలు అల్లడం తప్ప వేరే ఏ పని చేతకాదు. ఆ పనే చేసుకుంట రూపాయి రూపాయి వెనకేసుకుంటన్న. మా ఇంటామె నాకు తోడుగా ఉన్నది. కళ్లు మంచిగ కనబడ్తలేవని ఆధార్ కార్డు ఇవ్వనన్నరు. మా ఆమెకు కూడా ఇయ్యలేదు. ఎమ్మెల్యే సారు వచ్చిండు. మాకు రూ.50వేలు ఇచ్చిండు. సార్​కు ధన్యవాదాలు. మా బాధను ఆయన వరకు తీసుకుపోయిన ఈటీవీ భారత్​కు దండం."

- పాపయ్య, బాధితుడు

ఇదీ చదవండి:

CM Tirupathi Tour: తిరుపతికి సీఎం జగన్.. తెదేపా, వామపక్ష నేతల గృహనిర్బంధం !

ABOUT THE AUTHOR

...view details