ఆంధ్రప్రదేశ్

andhra pradesh

KTR met AP CM Jagan: దావోస్​లో సీఎం జగన్​తో తెలంగాణ మంత్రి కేటీఆర్

By

Published : May 24, 2022, 3:48 PM IST

KTR met ap cm Jagan: దావోస్​లో సీఎం జగన్​తో తెలంగాణ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం దావోస్ వెళ్లిన ఇద్దరు నేతలు.. అక్కడ భేటీ అయి సరదాగా పలకరించుకున్నారు. మంత్రి కేటీఆర్ ట్విటర్​ వేదికగా ఫొటోలను షేర్ చేశారు.

ktr met ap cm jagan
దావోస్​లో సీఎం జగన్​తో తెలంగాణ మంత్రి కేటీఆర్

KTR met ap cm jagan: స్విట్జర్లాండ్‌ దావోస్‌లో సీఎం జగన్‌తో.. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్, మంత్రి కేటీఆర్ దావోస్ వెళ్లారు. తన సోదరుడు జగన్‌తో మంచి సమావేశం జరిగిందని మంత్రి కేటీఆర్ ట్విటర్​ వేదికగా తెలిపారు. ఇద్దరు నేతలు సరదాగా పలకరించుకున్నారు. సూటూబూటు ధరించి.. ఫొటోలకు పోజులిచ్చారు.

అయితే ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, తెరాస తరచూ కుస్తీపడుతుండగా.. ఆ పార్టీల అధ్యక్షులు మాత్రం దావోస్​లో దోస్తీ చేస్తున్నారంటూ.. కామెంట్లు వస్తున్నాయి. రాజకీయంగా విమర్శలు చెేసుకున్నా.. పెట్టుబడుల సాధనలో మాత్రం తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. దావోస్ ఆర్థిక సదస్సు వేదికగా.. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల నుంచి పెట్టుబడులు.. సాధించే విషయంలో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details