ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హత్యాయత్నం చేస్తే కేసులు పెట్టరా..?: పవన్ కల్యాణ్

By

Published : Mar 17, 2021, 5:19 PM IST

జనసైనికులపై హత్యాయత్నం చేస్తే కేసులు పెట్టరా?అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని..లేనిపక్షంలో చట్టపరంగా ముందుకెళుతామని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జనసేన అభ్యర్థులపై జరిగిన దాడిని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. జనసైనికులపై హత్యాయత్నం చేస్తే కేసులు పెట్టరా?అని ప్రశ్నించారు. గోరంట్ల, అమలాపురం, నూజివీడు ఘటనలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా పాలనలో ఫ్యాక్షన్ పోకడ రాష్ట్రమంతటా విస్తరించిందని దుయ్యబట్టారు. జనసైనికులపై దాడులపై డీజీపీ నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. వీటన్నింటిపై కేసులు నమోదు చేయకపోతే చట్టపరంగా పోరాడతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details