ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంటర్ ద్వితీయ విద్యార్థులకు 'ఇంప్రూవ్​మెంట్'కు అనుమతి!

By

Published : Jan 26, 2021, 1:32 PM IST

ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు... ప్రథమ సంవత్సర ఇంప్రూవ్​మెంట్ పరీక్షలను రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. కొవిడ్ కారణంగా రద్దైన ఇంప్రూవ్​మెంట్ పరీక్షలను... ఇప్పుడు నిర్వహిస్తున్నట్లు ఇంటర్​ విద్యా మండలి వెల్లడించింది.

intermediate students
ఇంటర్ విద్యార్థులు

విద్యార్థులకు ఇంటర్ విద్యా మండలి శుభవార్త చెప్పింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు... ప్రథమ సంవత్సర ఇంప్రూవ్​మెంటు పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది. ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలతో పాటే జరిగే ప్రథమ సంవత్సర పరీక్షల ద్వారా.. ఇంప్రూవ్​మెంట్ కింద పరీక్షలు రాయటానికి ఏర్పాట్లు చేస్తోంది.

సాధారణంగా పబ్లిక్ పరీక్షల నిర్వహణ సమయంలో ఇంప్రూవ్​మెంట్ పరీక్షలు ఉండవు. ఇప్పటికే జరగాల్సిన ఈ పరీక్షలు.. కొవిడ్ కారణంగా నిర్వహించలేదు. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని.. పబ్లిక్ పరీక్షల నిర్వహణ సమయంలోనే ఇంప్రూవ్​మెంట్ పరీక్షలను సైతం నిర్వహిస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి వెల్లడించింది.

పాత విధానంలో ఉన్న విధంగానే.. పబ్లిక్ లేదా ఇంప్రూవ్​మెంట్ పరీక్షల్లో ఎక్కువగా వచ్చిన మార్కులు మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫీజు రూ.490 కాకుండా.. అదనంగా ప్రతి సబ్జెక్టుకు రూ. 160 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజును వచ్చే నెల 11 లోగా చెల్లించాలన్నారు. ప్రాక్టికల్స్​కు రూ. 190, పబ్లిక్ పరీక్షలకు రూ. 490 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు ఉండదని ఇంటర్ విద్యా మండలి స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

బుల్లెట్​ రైల్​: ఎల్ అండ్ టీకి మరో కాంట్రాక్ట్

ABOUT THE AUTHOR

...view details