ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TS High Court రాజాసింగ్‌ నిర్బంధంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

By

Published : Sep 7, 2022, 1:01 PM IST

TS High Court on Raja Singh Arrest : మతవిద్వేషాలు రెచ్చగొట్టారంటూ నిర్బంధానికి గురైన గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఉదాంతం ఆది నుంచి సంచలనమే. ఆయనపై పీడీ చట్టాన్ని వినియోగించడాన్ని హైకోర్టు తప్పు బట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ.. హోం శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది.

TS High Court on Raja Singh Arrest
రాజాసింగ్‌ నిర్బంధంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TS High Court on Raja Singh Arrest : గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌పై పీడీ చట్టాన్ని వినియోగించి నిర్బంధించడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. గత నెల 25న నగర పోలీసు కమిషనర్‌ పీడీ చట్టం కింద జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ధ్రువీకరిస్తూ ప్రభుత్వం 26న జారీ చేసిన జీవో 1651ను కొట్టివేయాలంటూ ఎమ్మెల్యే సతీమణి టి.ఉషాబాయి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. శాంతిభద్రతలను కాపాడటంలో వైఫల్యాన్ని తన భర్త నిర్బంధానికి కారణంగా చూపరాదని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.

దీనిపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వాదనలు వినిపించడానికి ఒక రోజు గడువు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అడిగారు. అయితే కౌంటర్‌ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సదాశివుని ముజీబ్‌కుమార్‌ కోరారు. దీనికి ధర్మాసనం అనుమతించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ.. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details