ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గ్రామపంచాయతీ ఉద్యోగుల సమ్మె సైరన్‌.. అక్టోబరు 2నుంచి నిరవధిక సమ్మె

By

Published : Sep 5, 2022, 9:46 PM IST

Panchayat raj Employees Strike Notice: తమ డిమాండ్లు సాధించుకునేందుకు గ్రామ పంచాయతీ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్టోబర్​ 2 నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. 9 ప్రధాన డిమాండ్లతో పంచాయతీ రాజ్​ కమిషనర్​కు సమ్మె నోటీసు పంపారు.

strike notice
panchayat raj

Strike Notice: గ్రామపంచాయతీ ఉద్యోగులు సమ్మెసైరన్‌ మోగించారు. అక్టోబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీ ఉద్యోగుల సంఘం 9 ప్రధాన డిమాండ్లతో పంచాయతీరాజ్ కమిషనర్‌కు సమ్మె నోటీసు పంపింది. వేతన బకాయిలు చెల్లిచాలని, పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్‌లకు 20 వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని పేర్కొన్నారు. నెలకు 6 వేలు రూపాయల చొప్పున ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రక్షణ పరికరాలు, ఏకరూపదుస్తులు సకాలంలో అందించాలని, ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు 10 లక్షల, సాధారణ మృతికి5 లక్షల రూపాయలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details