ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగ సంఘాలతో ముగిసిన చర్చలు... నేడు మరోసారి భేటీ

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు
ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు

By

Published : Feb 4, 2022, 6:28 PM IST

Updated : Feb 5, 2022, 1:53 AM IST

18:26 February 04

ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

నేటినుంచి ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ అత్యవసర చర్చలు చేపట్టింది. ఈ మేరకు మంత్రులు బొత్స, బుగ్గన, పేర్ని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. చలో విజయవాడ సక్సెస్‌ కావడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ నేపథ్యంలోనే అత్యవసరంగా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు ముగిసాయి. ఇప్పటివరకు తాము చెప్పాల్సింది చెప్పామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. సమస్యపై సీఎం ఆలోచిస్తున్నారని స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రులు వివరించారు. పీఆర్సీ నివేదికపై స్పష్టతపై రాని రాకపోవడంతో నేడు మరోసారి ఇవాళ ఉదయం 10 గంటలకు మరోసారి మంత్రుల కమిటీతో భేటీ కానున్నారు.

హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లలో మార్పులకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. అదనపు క్వాంటం పింఛన్‌ తదితర అంశాల్లో మార్పులు చేసేందుకు మంత్రులు అంగీకారం తెలిపారు. సీపీఎస్ రద్దుపై మరో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోందని..,చర్చల దృష్ట్యా సమయం కావాలని మంత్రుల కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులను కోరారు. ప్రభుత్వం సూచించిన అంశాలపై నిర్ణయం తెలపాలని ఉద్యోగ సంఘాల నేతలును కోరారు. చర్చించుకుని నిర్ణయం చెబుతాని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంతర్గతంగా చర్చించుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్చలకు కాసేపు విరామం ఇచ్చింది. అయితే కొద్దిసేపటి తరువాత .. మళ్లీ చర్చలు మొదలయ్యాయి.

హెచ్‌ఆర్‌ఏపై ప్రభుత్వ ప్రతిపాదనలు ఇలా ..

  • 2 లక్షల వరకు జనాభా ఉంటే 8 శాతం
  • 2-5 లక్షల జనాభా ఉంటే 12 శాతం
  • 5-15 లక్షల జనాభా ఉంటే 16 శాతం
  • 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 24 శాతం
  • అదనపు క్వాంటం పింఛన్‌లో 70 ఏళ్లవారికి 5 శాతం
  • అదనపు క్వాంటం పింఛన్‌లో 75 ఏళ్లవారికి 10శాతం

కమిటీ ముందు ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు ..

మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘాలు పలు ప్రతిపాదనలు చేశారు. పీఆర్సీ నివేదిక బయట పెట్టాలని కోరాయి. కనీసం 27 శాతానికి తగ్గకుండా 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్ రేట్లు పాతవే కొనసాగించాలని ప్రతిపాదించాయి. సిటీ కాంపన్సేటరీ అలవెన్సు కొనసాగించాలని విజ్ఞప్తి చేశాయి.

70 ఏళ్ల పింఛనర్లకు అదనపు క్వాంటమ్ 10శాతం.. 75 ఏళ్ల పింఛనర్లకు అదనపు క్వాంటమ్ 15శాతం కొనసాగించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపాదించారు. పొరుగు సేవల సిబ్బందికి కనీస టైమ్‌ స్కేలు ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయ సిబ్బందికి అక్టోబర్ నుంచి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరారు. మార్చి 31లోగా సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. రాష్ట్ర పీఆర్సీనే కొనసాగించాలని స్పష్టం చేశారు.

అంతకుముందు ముఖ్యమంత్రి జగన్​ను కలిసిన మంత్రులు పరిస్థితిని వివరించారు. సమ్మె జరిగితే ప్రభావం తీవ్రంగా ఉంటుందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగులతో మాట్లాడి సమ్మె విరమింపజేయాలని సీఎం మంత్రులకు సూచించారు.

ఇదీ చదవండి

AP Employees Steering Committee: 'సమ్మెలోకి వెళ్తే.. జీతాలు మిగుల్చుకుందామని ప్రభుత్వం కుట్ర'

Last Updated : Feb 5, 2022, 1:53 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details