ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అందుకే ఏపీకి అదనపు రుణ సేకరణకు అనుమతి..'

By

Published : Feb 2, 2021, 7:36 PM IST

కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీకి అదనపు రుణ సేకరణకు అనుమతిచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ.19,192 కోట్ల అదనపు రుణ సేకరణకు చేసినట్లు తెలిపారు. రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానమిచ్చారు.

finance minister nirmala seetha raman
finance minister nirmala seetha raman

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు రూ.19,192 కోట్ల అదనపు రుణ సేకరణకు అనుమతిచ్చినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్​కు తెలియజేశారు. రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానమిచ్చారు.

కేంద్రం నిర్దేశించిన నాలుగు సంస్కరణల్లో ఏపీ ఇప్పటివరకూ వన్‌నేషన్‌ వన్‌ రేషన్‌కార్డు, సులభతర వాణిజ్యం, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలను పూర్తి చేసిందని పేర్కొన్నారు. దీనికితోడు విద్యుత్తు సంస్కరణలనూ పాక్షికంగా పూర్తిచేసిందని వెల్లడించారు. ఈ సంస్కరణలు అమలుచేసినందుకు బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.9,090 కోట్ల రుణం తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. ఇప్పటికే అనుమతి ఇచ్చిన రూ.10,102 కోట్లతో కలుపుకుంటే ఇప్పటివరకూ రూ.19,192 కోట్లు అదనపు రుణసేకరణకు అవకాశం కల్పించామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: పల్లెపోరు: ఒకరి ఓటు ఇంకొకరు వేయవచ్చా..?

ABOUT THE AUTHOR

...view details