ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కొవిడ్ వ్యాక్సిన్

By

Published : Feb 19, 2021, 7:26 PM IST

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. తాము వ్యాక్సినేషన్​లో పాల్గొన్నామని... ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని ఐఏఎస్​, ఐపీఎస్ అధికారులు తెలిపారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కొవిడ్ వ్యాక్సిన్
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కొవిడ్ వ్యాక్సిన్

రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. గురువారం నుంచి అధికారులు టీకాలు తీసుకోవటం మొదలుపెట్టారు. శుక్రవారం ఐఏఎస్ అధికారి సిసోడియా, ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్ టీకా వేయించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్​ అందరూ తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ షెడ్యూల్ ప్రకారం టీకా తీసుకునేందుకు ముందుకురావాలని కోరారు. తాము వ్యాక్సినేషన్​లో పాల్గొన్నామని... ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details