ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్ర మంత్రులకు చంద్రబాబు లేఖ

By

Published : Nov 23, 2019, 8:41 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్​రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. భారత చిత్రపటంలో రాష్ట్ర రాజధాని అమరావతిని చేర్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

chandrababu letter to amith sha and kishan reddy

భారత చిత్రపటంలో అమరావతి విషయంపై హోంమంత్రి అమిత్ షా, సహాయమంత్రి కిషన్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 2న విడుదల చేసిన మ్యాప్‌లో అమరావతి లేకపోవడంతో ప్రజలు ఆవేదన చెందారని... లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని లేకపోవడం బాధించిందన్నారు. తమ ఎంపీలు చెప్పిన వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details