ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాబూ జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్

By

Published : Apr 5, 2021, 9:28 AM IST

బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు.

chandrababu and lokesh
చంద్రబాబు, లోకేశ్

బాబూ జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా.. ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ప్రజాస్వామ్య సమాజ నిర్మాణానికి జీవితాంతం కృషిచేసిన వ్యక్తి బాబు జగ్జీవన్‌రామ్‌ అని అన్నారు. బడుగువర్గాల అభ్యున్నతి కోసం పోరాడడని చంద్రబాబు అన్నారు.

బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ ద్వారా నివాళుర్పించారు. జీవితమంతా సమసమాజ స్థాపన కోసం.. బాబూ జగ్జీవన్‌రామ్‌ కృషిచేశారని లోకేశ్‌ అన్నారు.

ఇదీ చదవండి:8న పరిషత్​కు పోలింగ్‌.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు

ABOUT THE AUTHOR

...view details