ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు త్వరలోనే కేంద్ర బృందం పర్యటన

By

Published : Oct 24, 2020, 4:24 PM IST

రాష్ట్రంలో అకాల వర్షాలతో తలెత్తిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో పలు మంత్రిత్వ శాఖల అధికారులను భాగస్వామ్యులగా చేర్చింది. త్వరలోనే ఈ కమిటీ ఏపీలో పర్యటించనుంది.

central-commite-formation
central-commite-formation

ఏపీలో అకాల వర్షాలతో తలెత్తిన నష్టంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నష్టం అంచనా వేసేందుకు పలు మంత్రిత్వ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ కుమార్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. కమిటీలో వ్యవసాయం, ఆర్థిక, జలశక్తి, విద్యుత్, ఉపరితల రవాణా, జాతీయరహదారులు, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఉండనున్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఈ కమిటీ పర్యటించనుంది.

ABOUT THE AUTHOR

...view details