ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: 'గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగరేయటమే లక్ష్యం'

By

Published : Jan 17, 2021, 3:30 PM IST

కరోనా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ అవాస్తవాలను ప్రచారం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.

bjp state president bandi sanjay participated in bjp executive meeting in hyderabad
తెలంగాణ: 'గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగరేయటమే లక్ష్యం'

తెలంగాణ: 'గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగరేయటమే లక్ష్యం'

2023లో తెలంగాణలోని గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగరేయటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. భాజపా మొదటి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కొవిడ్‌ సమయంలో ప్రాణాలు లెక్కచేయకుండా భాజపా కార్యకర్తలు సేవ చేశారన్న ఆయన... కరోనా విషయంలో ముఖ్యమంత్రి అవాస్తవాలను ప్రచారం చేశారని ఆరోపించారు. టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని సైతం... పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు.

ఆధారాలతో బయటపెట్టాం

లాక్‌డౌన్‌లో ప్రాణాలు లెక్కచేయకుండా భాజపా కార్యకర్తలు సేవ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేస్తోంది.రాష్ట్రంలో మాత్రం ఆయుష్మాన్‌ భారత్‌ను పట్టించుకోలేదు. కరోనా విషయంలో అవాస్తవాలను ప్రచారం చేయాలని చూస్తే ఆధారాలతో బయటపెట్టాం. -బండి సంజయ్​, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి:చర్చిల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details