ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫసల్‌ బీమా యోజన పథకంలో ఏపీ సర్కారు భాగస్వామ్యం

By

Published : Jul 7, 2022, 2:23 AM IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్​ఆర్​ బీమాను కేంద్ర ఫసల్​ బీమా యోజనాతో భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ నిర్ణయించారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సహా అధికారుల బృందంతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

జగన్
జగన్

ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగస్వామ్యం కావాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్రం అమలు చేస్తోన్న వైఎస్ఆర్‌ ఉచిత పంటల బీమాను కేంద్ర ఫసల్‌ బీమా యోజనతో భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సహా అధికారుల బృందంతో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. పంట నష్టపోయే రైతులకు గరిష్ఠ ప్రయోజనం అందించే చక్కని విధి విధానాలు ఖరారు చేయగానే కేంద్ర పథకంతో భాగస్వామ్యం అవుతామని వెల్లడించారు.

అంతకుముందు గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, అక్కడ నుంచి వణుకూరులోని రైతు భరోసా కేంద్రం, కంకిపాడులో ఇంటిగ్రేటెడ్‌ అగ్రిల్యాబ్‌ను సందర్శించిన కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి బృందం తమ అనుభవాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. వ్యవసాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఏపీ మార్గదర్శకంగా నిలిచిందని కేంద్ర బృందం ఈ సందర్భంగా ప్రశంసించింది.

ఇదీ చూడండి :జగనన్న లే-ఔట్​లో కనీస సౌకర్యాలు లేవు : వైకాపా ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details