ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆయురారోగ్యాలతో ఉండండి.. దేశానికి మరింత సేవ చేయండి'

By

Published : Sep 17, 2020, 11:13 AM IST

Updated : Sep 17, 2020, 12:02 PM IST

ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా... రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

birthday wishes to pm modi
birthday wishes to pm modi

ప్రధాన నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. మోదీకి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయురారోగ్యాలతో ఉండి దేశానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు

ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని సమర్థంగా నడిపించే శక్తిని భగవంతుడు ఆయనకు మరింతగా ఇస్తాడని ఆశిస్తున్నానని ట్విటర్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:

ఇంద్రకీలాద్రిపై వివాదం... దేవాదాయశాఖ విచారణ ముమ్మరం

Last Updated : Sep 17, 2020, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details