ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా.. బోరుపాలెం గ్రామస్థుల తీర్మానం

By

Published : Jan 10, 2022, 12:34 PM IST

కార్పొరేషన్ ఏర్పాటును వ్యతిరేకించిన బోరుపాలెం గ్రామస్థులు
కార్పొరేషన్ ఏర్పాటును వ్యతిరేకించిన బోరుపాలెం గ్రామస్థులు ()

AMARAVTHI CAPITAL CITY ISSUE: అమరావతి సిటీ క్యాపిటల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు.. ఇవాళ గ్రామసభలు నిర్వహిస్తున్నారు. బోరుపాలెంలో నిర్వహించిన సభలో.. గ్రామస్థులు తమ అభిప్రాయాన్ని చెప్పారు.

AMARAVTHI CAPITAL CITY ISSUE: అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటును బోరుపాలెం గ్రామస్థులు వ్యతిరేకించారు. కార్పొరేషన్ ఏర్పాటుపై ఇవాళ నాలుగో రోజు గ్రామసభలు నిర్వహించారు. తుళ్లూరు ఎంపీడీవో ఏ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభ జరిగింది. ప్రభుత్వ ప్రతిపాదనను బోరుపాలెం గ్రామస్థులు వ్యతిరేకించారు. సీఆర్డీఏ చట్టంలో చెప్పిన 29 గ్రామాల్లో.. కేవలం 19 గ్రామాలతోనే ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు.

అదేవిధంగా.. మంగళగిరి కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో గ్రామసభలు ఎందుకు పెట్టలేదని అధికారులను నిలదీశారు. మూడు రాజధానుల అంశంపై కోర్టులో కేసులను పట్టించుకోకుండా గ్రామసభలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. భూ సమీకరణ సమయంలో కూడా ఇలాగే గ్రామసభ నిర్వహించి.. ఒప్పందాలు చేసుకున్నారని.. కానీ ప్రభుత్వం మాట తప్పిందని గుర్తు చేశారు.

ప్రభుత్వం తీసుకున్న 19 గ్రామాల కార్పొరేషన్​ను వ్యతిరేస్తున్నట్టు బోరుపాలెం గ్రామస్థులు చెప్పారు. కాగా.. అబ్బురాజుపాలెం, నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లోనూ నేడు సభలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:

TTD VAIKUNTA DARSHANAM: ముగిసిన వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ

ABOUT THE AUTHOR

...view details