ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతి రైతులకు రాష్ట్ర వ్యాప్త మద్దతు

By

Published : Oct 11, 2020, 9:11 PM IST

రాజధానిలో రైతుల అవిశ్రాంత పోరుకు.... రాష్ట్రవ్యాప్తంగానూ మద్దతు లభిస్తోంది. రాజధానికి భూములిచ్చిన అన్నదాతలకు న్యాయం జరగాలని.... వివిధ పార్టీలు, సంఘాలు గళమెత్తాయి. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని నేతలు హితవు పలికారు.

అమరావతి రైతులకు రాష్ట్ర వ్యాప్త మద్దతు
అమరావతి రైతులకు రాష్ట్ర వ్యాప్త మద్దతు

అమరావతి ఉద్యమం సోమవారానికి 300 రోజులకు చేరుతున్నందున.... రైతులకు మద్దతుగా.. రాష్ట్రవ్యాప్తంగానూ నిరసనలు జరిగాయి. కృష్ణా జిల్లా మైలవరంలో తెలుగుదేశం నేత దేవినేని ఉమ ఆధ్వర్యంలో... ర్యాలీ నిర్వహించారు. అమరావతి నుంచి రాజధానిని తొలగించడం ఎవరివల్లా కాదని.... దేవినేని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా వినుకొండలో... అన్ని పార్టీల కార్యకర్తలూ దీక్షలు చేపట్టారు. అమరావతి ముద్దు - మూడు రాజధానులు వద్దు అని నినాదాలు చేశారు. రాజధాని పోరాటానికి కులముద్ర వేసి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని..... తెలుగుదేశం నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పరిధిలో..... అమరావతి రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమంటూ ముమ్మడివరంలో తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతుల మనోభావాలను గౌరవించాలంటూ... ఏలురులో పాదయాత్ర నిర్వహించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో..... నెల్లూరులో తెలుగుదేశం నేతలు ర్యాలీ చేపట్టారు.

అమరావతి ఉద్యమానికి మద్దతుగా.... చిత్తూరు జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం నేతలు సమావేశాలు, నిరసనలు చేపట్టారు. అన్నదాత కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని... వారికి అన్యాయం చేయొద్దని హితవు పలికారు. రైతుల దీక్షకు సంఘీభావంగా అనంతపురం జిల్లా మడకశిరలో.... తెలుగుదేశం కార్యకర్తలు గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

అమరావతి రైతులకు రాష్ట్ర వ్యాప్త మద్దతు

ఇదీ చదవండి:కదం తొక్కిన రాజధాని రైతులు.. 9 కిలోమీటర్లు మహా ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details