ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సబ్​ప్లాన్ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా..?: న్యాయవాది శ్రవణ్ కుమార్

By

Published : Jun 5, 2021, 4:45 PM IST

వైకాపా ప్రభుత్వంపై న్యాయవాది శ్రవణ్ కుమార్ (advocate sravan kumar) విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ (sc st sub plan funds)​ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. సంబంధిత వర్గాల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు.

advocate sravan kumar
న్యాయవాది శ్రవణ్ కుమార్

ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్ (sc, st sub plan funds) నిధులను వివిధ పథకాలకు మళ్లించిన వైకాపా ప్రభుత్వం.. వెనకబడిన వర్గాల సంక్షేమానికి ఏ విధంగా కృషి చేసిందని న్యాయవాది శ్రవణ్ కుమార్ (advocate sravan kumar) ప్రశ్నించారు. సబ్ ప్లాన్ నిధులపై మంత్రిస్థాయి వ్యక్తి చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆంగ్ల మాధ్యమం (english medium)పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. సుప్రీం తీర్పులకు అనుగుణంగా జీవోలు జారీ చేయాలన్నారు. కావాలనే కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చి.. ప్రతిపక్షాలపై అబద్ధాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు(ambedkar statue)పై ఆర్భాటం చేసినా.. కనీసం ఇటుకరాయి కూడా వేయలేదని దుయ్యబట్టారు. అబద్ధాలను ప్రచారం చేయడం తప్ప... ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించటం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details