ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE VIDEO : బట్టల షాప్​కెళ్లిన పల్సర్​ బైక్​.. అసలేం జరిగిందంటే?

By

Published : Nov 10, 2021, 11:09 AM IST

ఓ వస్త్ర దుకాణంలో అందరూ తిరిగ్గా కూర్చోని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ బైక్​ దుకాణంలోకి దూసుకొచ్చింది. ఉన్నట్టుండి బండి దుకాణంలోకి పిడుగులా వచ్చి పడేసరికి ఏం జరిగిందో అర్థంగాక వారికి వెన్నులో వణికుపుట్టింది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

బట్టల షాప్​కెళ్లిన పల్సర్​ బైక్​.. అసలేం జరిగిందంటే?
బట్టల షాప్​కెళ్లిన పల్సర్​ బైక్​.. అసలేం జరిగిందంటే?

తెలంగాణలోని ఖమ్మంలోని రావిచెట్టు బజార్‌లోని వస్త్ర దుకాణంలోకి ద్విచక్ర వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనతో షాపుల ఉన్నవాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉన్నట్టుండి బండి దుకాణంలోకి పిడుగులా వచ్చి పడేసరికి ఏం జరిగిందో అర్థంగాక వారికి వెన్నులో వణికుపుట్టింది. ప్రమాద సమయంలో దుకాణంలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తి కూడా క్షేమంగా బయటపడ్డాడు. వాహనవేగానికి కౌంటర్‌ను ఢీ కొట్టి దుకాణంలో ఎగిరిపడ్డాడు. పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి:LIVE VIDEO : మూతికి నిప్పు.. అలరించబోయి విలపించాడు..!

ABOUT THE AUTHOR

...view details