ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో పట్టణ ప్రాంత చిన్నారులకు కంటి'వెలుగు' తక్కువ

By

Published : Nov 21, 2019, 5:30 AM IST

కంటి వెలుగు పథకంలో భాగంగా తొలివిడత పరీక్షలు చేయించుకున్న 66 లక్షల మంది చిన్నారుల్లో ... 4 లక్షల 33 వేల మందికి దృష్టి లోపాలు ఉన్నట్లు తేలింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ విద్యార్థులకు కంటి సమస్యలు తక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

'పట్టణాలతో పోలిస్తే గ్రామీణ విద్యార్థులకు కంటి సమస్యలు తక్కువ'

'పట్టణాలతో పోలిస్తే గ్రామీణ విద్యార్థులకు కంటి సమస్యలు తక్కువ'

రాష్ట్రంలో చిన్నారుల్లో దృష్టి లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి . కంటి వెలుగు పథకంలో భాగంగా తొలివిడత పరీక్షలు చేయించుకున్న 66 లక్షల మంది చిన్నారుల్లో ...4 లక్షల 33 వేల మందికి దృష్టి లోపాలు ఉన్నట్లు తేలింది. మలి విడతలో లక్షా 24 వేల మందికి పరీక్షలు నిర్వహించగా … 60 శాతం చిన్నారులకు కళ్ల జోళ్లు అవసరమని... వీటితో పాటు ఇతర వైద్య సేవలు పొందాలని గణాంకాల ద్వారా వెల్లడైంది. అనంతపురం జిల్లాలో ఏడేళ్ల చిన్నారికి కంటి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు . గత నెలలో కంటి వెలుగు పథకం కింద 60 వేల 694 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. కడప, నెల్లూరు , ప్రకాశం , గుంటూరు , కృష్ణా , విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో గరిష్ఠంగా 7 నుంచి 8 శాతం చిన్నారులకు దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించారు.

అనంతపురం జిల్లాలో 6. 78 శాతం ….తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలో 4 నుంచి 5 శాతం పిల్లలకు కంటి లోపాలున్నట్లు తేలింది. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 5 నుంచి 6 శాతం మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నారు. తొలివిడత పరీక్షల ద్వారా తీవ్రత దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన 4 లక్షల 32 వేల మందికి ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు. పట్టణాలతో పోలిస్తే... గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు తేలింది.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details