ఆంధ్రప్రదేశ్

andhra pradesh

GOLD SMUGGLING: అవాక్కైన అధికారులు.. ఇలా కూడా బంగారం తరలించొచ్చా..!

By

Published : Sep 2, 2021, 9:19 PM IST

బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తెచ్చేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త ప్లాన్లతో అధికారులకు సవాలు విసురుతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలోని శంషాబాద్‌ విమానాశ్రయంలో 495 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

GOLD SMUGGLING
GOLD SMUGGLING

అగ్గిపుల్ల, సబ్బుబిల్ల కాదేదీ కవితకు అనర్హం కాదన్నాడు మహాకవి శ్రీశీ.. అయితే చెప్పులు, క్రీము కప్పులు, హెయిర్‌ క్లిప్పులు కావేవీ బంగారం అక్రమ రవాణాకు అనర్హమని నిరూపిస్తున్నారు ప్రస్తుతం కొందరు. అధికారులే ఆశ్చర్యపోయే రీతిలో దుబాయ్‌ నుంచి బంగారం తీసుకొస్తూ.. ఓ వ్యక్తి తెలంగాణలోని శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. రూ.24 లక్షల విలువైన 495 గ్రాముల బంగారాన్ని.. చెప్పులు, ఫేస్‌ క్రీము, హెయిర్‌ స్ట్రయిట్‌నర్‌లో దాచుకుని తెచ్చాడు.

కానీ పక్కా సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని.. బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

అధికారులే అవాక్కయ్యేలా.. ఇలా కూడా బంగారం తరలించొచ్చా..!

ABOUT THE AUTHOR

...view details