ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎస్వీ మోహన్​ రెడ్డికే టికెట్​ ఇవ్వాలి - అధిష్ఠానానికి అనుచరుల డిమాండ్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 5:50 PM IST

YSRCP MLA Ticket Demands In karnool Constituency : కర్నూలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి ఇవ్వాలని ఆయన అనుచరులు అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై చర్చించేందుకు వారు స్థానిక హోటల్లో సమావేశమయ్యారు. కర్నూలు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి ప్రారంభంలో నాయకులు ఎవరూ లేని సమయంలో ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీని బలపరిచారన్నారు.

EX MLA SV Mohan reddy Latest : ఎస్వీ మోహన్ రెడ్డి వల్లే 2014, 2019 ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయం సాధించిందని ఆయన అనుచరులు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు తమ పార్టీయే అధికారంలో ఉన్నా తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు. తమపై అక్రమ కేసులు పెట్టారని, ఆర్థికంగా ఎంతో దెబ్బ తీశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో వైఎస్సార్సీపీ  విజయం సాధించాలంటే ఎస్వీ మోహన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.  

ABOUT THE AUTHOR

...view details