ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అన్నమయ్య జిల్లాలో దారుణం - గర్భిణిపై మద్యం మత్తులో వైఎస్సార్సీపీ నేతల దాడి - Ysrcp Leaders Beating Women

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 7:30 PM IST

ysrcp_leaders_beating-_women_in_annamayya_district (ETV BHARAT)

YSRCP Leaders Beating  Women in Annamayya District : వైఎస్సార్సీపీ నాయకుల దాష్టీకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కుటగులొల్లపల్లిలో సమస్య పరిష్కరించమని కోరిన మహిళను గర్భవతి అని కూడా చూడకుండా వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డి తరఫున ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రచారానికి వెళ్లారు. ప్రచారం నిర్వహిస్తుండగా మల్లికార్జున్ అనే వ్యక్తి తమ వీధిలో దీపాలు వెలగడం లేదని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ మల్లికార్జునపై దాడికి దిగారు.

ఇంటి బయట ఘర్షణను గుర్తించిన మల్లికార్జున భార్య కళ్యాణి బయటకు వచ్చి వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వైసీపీ కార్యకర్తలు గర్భవతి అయిన కళ్యాణిని కిందకు తోసేయటంతో పాటు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడిలో అస్వస్థతకు గురైన కళ్యాణిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమస్యను పరిష్కరించమని కోరినందుకు దాడి చేశారని కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details