ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పల్నాడులో వైఎస్సార్సీపీ దాష్టీకం - టీడీపీ నాయకులపై కర్రలతో దాడి - YSRCP Attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 10:45 AM IST

ysrcp_attack (ETV Bharat)

YSRCP Attack TDP Leaders in Palnadu District : పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయారు. తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టించారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై వైఎస్సార్సీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దాడిలో ఇద్దరు టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

వెల్దుర్తి మండలం లోయపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం వర్గీయులను పోలింగ్ కేంద్రం నుంచి వైఎస్సార్సీపీ నాయకులు బయటకు లాగేయడంతో ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి. గురజాల నియోజకవర్గం నడికుడిలో వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. తెలుగుదేశం నేత నెల్లూరు రామకోటయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డారు. కర్రలతో దాడి చేయడంతో తెలుగుదేశం కార్యకర్త తలకు గాయమైంది. పోలింగ్ కేంద్రం వద్ద గుమికూడిన వారిని పోలీసులు చెదరగొట్టారు.

మాచర్ల నియోజక వర్గం కంభంపాడులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ నేతలు, టీడీపీ వర్గీయులపై గొడ్డళ్లు, వేటకొడవళ్లు, రాడ్లతో రోడ్లు పైకి వచ్చి ఆందోళన చేశారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీగా పోలీసులు మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details