ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రజలను రెచ్చగొడుతున్న వైఎస్సార్సీపీ గృహ సారథులు - చంద్రబాబు వల్లే ఇంటింటికీ పింఛన్లు రావట్లేదంటూ ప్రచారం - Allegations on Pension Distribution

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 1:53 PM IST

YSRCP Activist Fake Propaganda On Pension Distribution

YSRCP Activist Fake Propaganda On Pension Distribution : గ్రామ వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు ఓటర్లను ప్రభావితం చేస్తారనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నుంచి వారిని తొలగించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన వైఎస్సార్సీపీ గృహ సారథులు ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

 తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu) వల్లే ఇంటింటికీ పింఛన్లు  రావట్లేదంటూ వైఎస్సార్సీపీ గృహ సారథులు ప్రజలను రెచ్చగొడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో అధికార పార్టీ గృహ సారథులు లక్ష్మీ నాయుడు, లక్ష్మణ్ గ్రామాల్లో తిరుగుతూ తెలుగుదేశం పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లింగేటిలోని ఇంటింటికీ వెళ్లి మళ్లీ జగన్‌ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలంటూ గిరిజనులపై ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబు వస్తే పింఛన్లు రావని, సంక్షేమ పథకాలన్నీ తీసేస్తారని, జగన్ వస్తేనే అన్ని పథకాలు అందుతాయంటూగిరిజనులను ఎలా తప్పుదోవపట్టిస్తున్నారో పైన ఉన్న వీడియోలో మీరే చూడండి.

జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు వాలంటీర్లకు పింఛన్లు పంపిణీ చేయాలని డబ్బులు ఇస్తున్నారు. వారు తప్పుడు ప్రచారం చేస్తూ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details