ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బూజుపట్టిన కర్జూర, కుళ్లిన కోడిగుడ్లు - అంగన్వాడీ కేంద్రాల్లో సరకులు దారుణం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 10:05 AM IST

YSR Sampurna Poshana Food Items spoiled in Anganwadi Centres: అంగన్వాడీలపై ప్రభుత్వం వ్యవహరించిన మొండి వైఖరి కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లోని సరకులు కుళ్లిపోయి, పురుగులు పట్టాయి. ఇదే పరిస్థితి అనేక ప్రాంతాల్లో నెలకొంది. కార్యకర్తలు సమ్మెలో ఉన్న సమయంలో సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ సెంటర్లు నిర్వహించాలని జగన్‌ సర్కారు ప్రయత్నించినా అది ఫలించలేదు.  

Vijayawada Anganwadi Center: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని రామవరప్పాడు సహా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్సాఆర్ సంపూర్ణ పోషణ సరుకులు పాడై పోయాయి. కోడిగుడ్లు కుళ్లిపోయి పురుగులు పట్టాయి. బెల్లం రంగు మారి ఎండిపోయింది. కర్జూరం బూజు పట్టింది. 42 రోజుల పోరాటం తర్వాత మంగళవారం అంగన్వాడీలు తిరిగి విధులకు హాజరయ్యారు. విధుల్లో చేరిన అంగన్వాడీలకు ఆయా కేంద్రాల్లోని సరకుల పరిస్థితులు వారిని విస్మయానికి గురిచేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పాడైపోయిన వాటిని తొలగించకుండా లబ్ధిదారులకు అందజేస్తే రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

ABOUT THE AUTHOR

...view details