ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్ పాలనలో రైతులకు అష్టకష్టాలు- నగరిలో మంత్రి రోజా గ్రావెల్, ఇసుక దోపిడి వైఎస్ షర్మిల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 10:19 PM IST

YS Sharmila key comments on Minister Roja

 YS Sharmila key comments on Minister Roja: చిత్తూరు జిల్లా నగరి  బహిరంగ సభలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్నా అభివృద్ధి ఏమీ జరగలేదని వైఎస్  షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రైతులకు అష్టకష్టాలు వచ్చాయని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో పంటకు గిట్టుబాటు ధర లేదు.. అప్పు చేయని రైతు లేడని ఆవేదన వ్యక్తం చేశారు.  రాజశేఖరరెడ్డి పాలన అంటే ఇదేనా అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని గురించి పాలకపక్షం, ప్రతిపక్షం పట్టించుకోలేదని షర్మిల ఆరోపించారు. పదేళ్లలో మనకిచ్చిన ఒక్క వాగ్దానమైన కేంద్రం నెరవేర్చిందా? అంటూ ప్రశ్నించారు. నవరత్నాల్లో ఒకటైన జలయజ్ఞం అనే రత్నం ఏమైందని షర్మిల ప్రశ్నించారు. గాలేరు-నగరిని 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.. ఐదేళ్లుగా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి రోజా నగరిలో గ్రావెల్, ఇసుకను దందాలతో దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగుల పీఎఫ్‌ను దోచుకునేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది వైఎస్  షర్మిల ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details