ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ వెంట నడవాలి: వైసీపీ ఎమ్మెల్యే - YCP MLA wants volunteers to resign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 10:44 PM IST

YCP MLA Candidate Talari Rangaiah wants Volunteers to Resign: వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ వెంట నడవాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య అన్నారు. షాదీమాహాల్ లో వాలంటీర్లతో ఆయన రహస్య సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా హాజరైన వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడిన రంగయ్య అందరూ రాజీనామా చేసి పార్టీకోసం పూర్తిస్థాయిలో పనిచేయాలని చెప్పారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని, మళ్లీ మీ స్థానాల్లో వాలంటీర్లుగా నియమించేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. రానున్నది వైసీపీ ప్రభుత్వమని పార్టీ కోసం పనిచేయాలని ఆయన చెప్పారు. కొందరు రాజీనామాకు ముందుకు రాని వారికి జరగబోయే పరిణామాలను వివరించి, అందరూ రాజీనామా చేసేలా మిగిలిన వాలంటీర్లు కృషిచేయాలన్నారు. 

వాలంటీర్ల సమావేశానంతరం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. అయితే చాలా మంది వాలంటీర్లు రాజీనామాకు ఆసక్తి చూపడంలేదు. సమావేశానంతరం వెలుపలికి వచ్చిన వాలంటీర్లు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాజీనామా చేసిన వారిని తీసుకోరని, మనమంతా కొనసాగటమే మంచిదన్నట్లుగా ఎక్కువ మంది వాలంటీర్లు గుంపులుగా నిలబడి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజీనామా చేస్తే కార్యకర్తల తరహాలో ప్రచారానికి తిరగాలని వత్తిడి చేస్తారని, ప్రచారం చేస్తే అనేక సమస్యలు వస్తాయని మరికొందరు వాలంటీర్లు చర్చలో మాట కలిపినట్లు సమాచారం. 

ABOUT THE AUTHOR

...view details