ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో వైవీ సుబ్బారెడ్డికి చేదు అనుభవం - ఓటేసేందుకు వెళ్లగా నిలదీసిన ఓటర్లు - Women Protest Against YV Subbareddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 4:58 PM IST

Women_Protest_Against_YV_Subba_Reddy (ETV Bharat)

Women Protest Against YV Subba Reddy: వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి విశాఖలో చేదు అనుభవం ఎదురైంది. మధురవాడ ప్రాంతం పోతిన మల్లయ్య పాలెంలోని పోలింగ్ బూత్ నెంబర్ 331 వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన సుబ్బారెడ్డిని ఓటర్లు నిలదీశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతుల కల్పించటంలో ప్రభుత్వం, ఎన్నికల అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డిని ఓటర్లు నిలదీశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు తాగునీరు, టెంట్లు వేయాల్సి ఉన్నప్పటికీ ఎందుకు సౌకర్యాలు కల్పించలేదని ప్రశ్నించారు. 

ఓటు వేసేందుకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డి నేరుగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడంతో అక్కడున్న ఓటర్లు ఆయనను ఆపే ప్రయత్నం చేశారు. కనీసం క్యూలో నిల్చోకుండా నేరుగా వెళ్లి ఎలా ఓటు వేస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనటంతో వైఎస్సార్సీపీ నేతలకు ఓటర్ల నుంచి నిరసన సెగ తగులుతోంది. ఓటు వేయటానికి వస్తున్న అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details