ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కృష్ణాబోర్డు అనుమతి ఉంటేనే ప్రాజెక్టుల్లోకి ఇరు రాష్ట్రాల అధికారులకు ప్రవేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 3:47 PM IST

krishna_board

Without KRMB permission no entry for both telugu states officials in into the projects కృష్ణాబోర్డు అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ డ్యామ్‌లపైకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజినీర్లు, అధికారులకు ప్రవేశం కల్పించాలని రిజర్వ్‌ బలగాలను కేంద్రం ఆదేశించింది. సాగర్‌ ప్రాజెక్టు నిర్వహణకు రెండు రాష్ట్రాలు రెండు వైపులా చేపట్టాల్సిన అత్యవసర పనుల కోసం బోర్డుకు ముందుగా లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలంది. బోర్డు పర్యవేక్షణలోనే పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 17న దిల్లీలో నిర్వహించిన సమావేశం మినిట్స్‌ను రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ పంపించింది.

సమావేశంలో చర్చించిన విషయాలకు రెండు రాష్ట్రాలు సమ్మతి తెలియజేశాయని పేర్కొంది. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల కింద 15 అవుట్‌లెట్లను నెల రోజుల్లో కృష్ణాబోర్డుకు అప్పగించాలని రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, బోర్డు, ప్రాజెక్టుల నిర్వహణ ప్రొటోకాల్స్‌పై చర్చించి వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించాలని మినిట్స్‌లో పేర్కొంది. బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు వెంటనే నిధులు విడుదల చేయాలని సమావేశం నాటి నుంచి 15 రోజుల్లో మరొక సమావేశం నిర్వహిస్తామని మినిట్స్‌లో పొందుపరిచారు.

ABOUT THE AUTHOR

...view details