ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాజీ మంత్రి శిద్దా ఇంట్లో కత్తితో దుండగుల హల్​చల్- వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు - ysrcp leader Sidda Raghava rao

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 6:51 PM IST

Unknown persons halchal in Former Minister House : మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్సీపీ నేత శిద్దా రాఘవరావు ఇంట్లో గుర్తుతెలియని దుండగులు హల్​చల్ చేశారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో రాఘవరావు ఇంటికి కాపలాగా ఉన్న వాచ్​మెన్ పై దుండగులు దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన వాచ్​మెన్ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. శిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. 

Police Identified Assailants Had Knives In Cctv Footage : సిద్ధ రాఘవరావు ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు ముఖం కనిపించకుండా మాస్కులు పెట్టుకుని అతని ఇంట్లోకి ప్రవేశించినట్టు సీసీటీవీ ఫుటేజ్​లో రికార్డయింది. దుండగుల చేతిలో చాకులు ఉన్నట్టు సీసీటీవీ పుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ రికార్డులు ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. దుండగులు ఎవరు, ఎందుకు సిద్ధ రాఘవరావు ఇంట్లోకి చొరబడ్డారు అని వివిధ కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details