ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హైదరాబాద్​ను విజయవాడగా చూపించి మోసం చేయాలనుకుంటున్నారు- పట్టాభి - TDP Leader Pattabhiram

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 3:32 PM IST

TDP Leader Pattabhiram Explain YSRCP fake Video : విజయవాడ తూర్పు అభివృద్ధిపై వైఎస్సార్సీపీ ఫేక్ వీడియో విడుదల చేసిందంటూ తెలుగుదేశం పార్టీ  తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వాస్తవాలను బహిర్గతం చేశారు. హైదరాబాద్​లో చిత్రీకరించిన దృశ్యాలను విజయవాడగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్​లో చిత్రీకరించి విజయవాడ అభివృద్ధిగా చూపించారంటూ వాస్తవాలను ఆధారాలతో పట్టాభి రామ్ బయటపెట్టారు. విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ చేసిన అభివృద్ధిపై తెలుగుదేశం వీడియో విడుదల చేసింది. హైదరాబాద్​లో వీడియో తీసి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తీసినట్లు చెప్పుకునే స్థాయికి వైఎస్సార్సీపీ నేతలు దిగజారి పోయారని పట్టాభి రామ్ మండిపడ్డారు. అవినాష్ అఫిడవిట్​లో దాఖలు చేసిన ఆస్తుల వివరాల కూడా ఫేక్​ అని పట్టాభిరామ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ గెలిపించుకుని ఐదు ఏళ్లుగా నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ ప్రారంభిస్తామని, ఐదు ఏళ్లుగా జరుగుతున్న దాడులని ఆపుతామని పట్టాభిరామ్‌ స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details