ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Live: టీడీపీ - జనసేన ఉమ్మడి మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 11:04 AM IST

Updated : Mar 7, 2024, 11:29 AM IST

TDP Janasena Leaders Press Meet Live
 TDP  Janasena Leaders Press Meet  Live: తెలుగుదేశం - జనసేన ఉమ్మడి కార్యాచరణపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్​ మీడియా సమావేశం నిర్వహిచారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిపారు. తెలుగుదేశం - జనసేన శ్రేణులు ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఇప్పటికే ఇరుపార్టీల అధ్యక్షులు సూచించారు. తాజాగా టీడీపీ - జనసేన  సీట్ల పంపకాలు పూర్తవగా, బీజేపీతో పొత్తు అంశంపై నేడు చంద్రబాబు, పవన్  దిల్లీ వెల్లనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీసీ డిక్లరేషన్, టీడీపీ ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే మెుదటి విడుతలో టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మలివిడత అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం - జనసేన కూటమి (TDP - Janasena Alliance) కసరత్తు చేస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును  ఇదే అంశంపై నిన్న భేటీ అయ్యారు.  మలివిడత అభ్యర్థుల ఎంపికపై ఇరువురు నేతలు కీలక చర్చలు జరుపిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు,నాదెండ్ల మీడియా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.  
Last Updated : Mar 7, 2024, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details