ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాకాణి ఫైల్స్​ దొంగతనం కేసులో కుక్కే గెలిచింది: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 8:27 AM IST

Somireddy Comments on Kakani Govardhan Reddy Court Case

Somireddy Comments on Kakani Govardhan Reddy Court Case: నెల్లూరు కోర్టు చోరీ కేసులో కుక్కే గెలిచిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పటి ఎస్పీ విజయరావు ఏం చెప్పారో అదే సీబీఐ కూడా చెప్పిందన్నారు. ఈ కేసులో దాదాపు పది నెలల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన సీబీఐ గతంలో నెల్లూరు జిల్లా ఎస్పీ చెప్పిన కథనే తానూ తాజాగా చెప్పింది. సయ్యద్‌ హయ్యత్‌, షేక్‌ ఖాజా అనే చిల్లర దొంగలే ఈ చోరీకి పాల్పడ్డారని వారికి రాజకీయంగా ఎలాంటి సంబంధాలూ లేవంటూ అప్పట్లో నెల్లూరు ఎస్పీ చెప్పిన కథే మళ్లీ సీబీఐ చెప్పుకొచ్చింది. 

ఈ కేసుకు సంబంధించి విజయవాడలోని మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో గతేడాది అక్టోబరు 27న సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. దాఖలు చేసిన అభియోగపత్రం ఆదివారం వెలుగులోకి వచ్చింది. అందులోని అంశాలను పరిశీలిస్తే అసలు ఒక దాంతో మరొక దానికి పొంతన కుదరట్లేదు. అసలు ఈ వ్యవహారంతో కాకాణి గోవర్థన్ రెడ్డికి సంబంధమే లేదంటూ పదే పదే చెప్పడాన్ని అభియోగపత్రంలో ప్రాధాన్యత ఇచ్చారు. సీబీఐ పేర్కొన్న అభియోగపత్రంలోని అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని సోమిరెడ్డి అన్నారు. సరిగ్గా కాకాణి ఫైల్స్ దొంగిలించేలా కుక్క చేసిందని సీబీఐ చెప్పడం విడ్డురంగాఉందని ఆయన అన్నారు. రోడ్డు మీద దొంగతనాలు చేసేవారు డేటా డిలీట్ చేయగలరా అని ప్రశ్నించారు. మంత్రి కాకాణి వ్యాఖ్యలను సోమిరెడ్డి తప్పుబట్టారు.

ABOUT THE AUTHOR

...view details