మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన శ్రీశైలం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 11:23 AM IST
Shivaratri Arrangements In Srisailam temple : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం (Srisailam) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబు అవుతోంది. నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి .ఈనెల 11 వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, దేవస్థానం (Temple) అధికారులు విస్తృత ఏర్పాటు చేపట్టారు. పాదయాత్రగా తరలివస్తున్న భక్తులకు దాతల సహకారంతో మంచినీటి సరఫరా, అన్నదానం వంటి కార్యక్రమాలను చేపట్టారు. శ్రీశైల క్షేత్రంలో భక్తులకు పార్కింగ్, తాత్కాలిక వసతి, దర్శనం ఏర్పాట్లను సిద్ధం చేశారు.
Maha Shivaratri Celebrations at Srisailam Temple : భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో అధికారులు అన్నీ ఏర్పాట్లు (Arrangements) చేస్తున్నారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం 8.10 గంటలకు దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి , ఈవో డి. పెద్దిరాజు, ఆలయ అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి. శివ సంకల్పం, గణపతి పూజా అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.