ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గ్రామ సచివాలయంలో చిందులు - వైసీపీ నాయకులతో కలిసి సిబ్బంది, వాలంటీర్లు స్టెప్పులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 9:23 PM IST

Updated : Mar 7, 2024, 10:36 PM IST

Sachivalayam Employees Dance in Darakonda of Alluri district : ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన సచివాలయంలో ఉద్యోగులతోపాటు, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు డ్యాన్స్‌​లు వేసి విమర్శల పాలైన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. గురువారం జిల్లాలోని జీకేే విధి మండలం ధారకొండ గ్రామంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం భవనం మెుత్తం కలయ తిరిగారు. తరువాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నేతలు, చివరికి సర్పంచ్ సైతం డ్యాన్స్​లు వేశారు. 

సినిమా పాటలు పెట్టుకొని మహిళ సిబ్బందితో మగవారు చిందులు వేశారు. అందరు చూస్తుండగానే డీజే బాక్సులు పెట్టుకొని డ్యాన్స్‌​లు వేయటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సమస్యల పరిష్కారం కోసం నిత్యం ఎంతోమంది ప్రజలు సచివాలయాల చూట్టూ తిరగటం చూస్తున్నాం. వారి బాధలను పట్టించుకొని సిబ్బంది, వైసీపీ నాయకులు ఇలా డ్యాన్స్​లు వేయటం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదేం పని అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Mar 7, 2024, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details